CJI DY Chandrachud: నీట్- యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా నిందితులకు మే4 వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే.. లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. అలా అయితే, స్ట్రాంగ్ రూమ్ వాలెట్‌లో క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందా.. అని ఆయన ప్రశ్నించారు. బిహార్ పోలీసుల విచారణ రిపోర్టును గుర్తు చేశారు.
Read Also: December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
అయితే, అంతకు ముందు వేసిన పిటిషనర్ల పక్షాన వాదిస్తున్న న్యాయవాది నరేందర్ హుడా తన వాదనలు వినిపించగా.. 161 వాంగ్మూలాలు పేపర్ లీక్ మే 4వ తేదీ కంటే ముందే జరిగాయని బలంగా చెబుతున్నట్లు తెలిపారు. బిహార్ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత బ్యాంకుల్లో క్వశ్చన్ పేపర్లను డిపాజిట్ చేయటానికి ముందే లీక్ చేసినట్లు వెల్లడించారు. మే 3వ తేదీ లేదా అంతకంటే ముందే పేపర్ బయటకు వెళ్లినట్లు పేర్కొన్నారు.. కేవలం 5-10 మంది స్టూడెంట్స్ కోసం చేసిన లీకేజీ కాదని నరేందర్ హుడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఓ గ్యాంగ్ ఎప్పటి నుంచో ఈలాంటి పని చేస్తోందని ఆరోపించారు. సంజీవ్ ముఖియా, ఇతర కీలక నిందితులు అరెస్టు కాలేదనే విషయాన్ని కూడా పిటిషనర్ల తరపు లాయర్ గుర్తు చేశారు.
Read Also: Top Headlines @ 1PM : టాప్ న్యూస్
కాగా, నీట్-యూజీ 2024కు సంబంధించి దాఖలైన 40 పిటిషన్లు ఇవాళ్టి నుంచి సుప్రీంకోర్టు విచారణ కొనసాగనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తోంది. వీటిలో వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్‌టీఏ కోరింది.