సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది
ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ..ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ నుసుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
Cast Reservation : బీహార్‌లో 65శాతం రిజర్వేషన్ల కేసులో నితీష్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పాట్నా హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై నేడు విచారణను పునఃప్రారంభించనుంది.
Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల దగ్గర పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాయి.
Kanwar Yatra: కన్వార్ యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా దుకాణాలపై ప్రదర్శించాలన్న ఆదేశాలను తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొనింది.
నీట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను మళ్లీ విడుదల చేసింది. ఫిజిక్స్‌లో అస్పష్టమైన ప్రశ్న తలెత్తింది.
నీట్-యూజీపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇంతలో సీనియర్ న్యాయవాది చేసిన పని సీజేఐ డీవై చంద్రచూడ్‌కు కోపం తెప్పించింది.
NEET: నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత దశలో పరీక్షాల ఫలితాలు విఫలమయ్యాయని లేదా ఏదైనా క్రమబద్ధమైన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించే అంశాలు రికార్డులో లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.
CJI DY Chandrachud: నీట్- యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా నిందితులకు మే4 వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే.. లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.