NEET UG 2024: మే 5వ తేదీన జరిగిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్-యూజీ 2024పై తీవ్ర దుమారం రేగింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరపనుంది. గతంలో విచారణ చేసిన న్యాయస్థానం సెంటర్ల వారీగా ఫలితాలను రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజీ, మార్కుల విషయంలో పలు ఆరోపణలతో సతమతమవుతున్న మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను ఎన్టీఏ శనివారం రిలీజ్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెంటర్ల వారీగా ఫలితాలను వెల్లడించింది.
Read Also: Geoffrey Boycott Health: ఆసుపత్రిలో క్రికెట్ దిగ్గజం.. పరిస్థితి విషమం!
అయితే, ఇవాళ సుప్రీంకోర్టు వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసిన కాజ్ లిస్ట్ లో.. నీట్-యూజీ2024 వివాదంపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరింది. 40కి పైగా పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది.
Read Also: Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు..
ఇక, ఎన్టీఏ రిలీజ్ చేసిన డేటా విశ్లేషణలో పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలతో లబ్ధిపొందిన అభ్యర్థులు రాణించలేదనే విషయం తేలిపోయింది. 4,750 కేంద్రాలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష భవితవ్యంపై తుది తీర్పు కోసం వేచి చూస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై పలు పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ డేటాను ఎన్టీఏ విడుదల చేసింది.