సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కో-ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. అంతేకాకుండా.. ఈ కమిటీలో నలుగురు సభ్యులను కూడా నియామించారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు.
Kolkata Murder Case : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు తదుపరి విచారణ నేడు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది.
దేశ సర్వోన్న త న్యాయస్థానంలో కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు చుక్కెదురైంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే మంగళవారానికి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ పిటిషన్లో సవాలు చేశారు.
సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Online Trolling: దేశంలో అత్యున్నత సంస్థలు కూడా ఆన్లైన్ ట్రోలింగ్కి అతీతం కాదని ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. సోషల్ మీడియా ట్రోల్స్‌ని, వారి చర్యలని దారుణంగా అభివర్ణించింది.