దేశ సర్వోన్నత న్యాయస్థానం హామీ మేరకు వైద్యులు మెత్తబడ్డారు. సమ్మె విరమించాలంటూ సుప్రీంకోర్టు చేసిన విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ప్రకటించింది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్‌కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీం కోర్టు వారికి హామీ ఇచ్చింది.
Kolkata Mudrer Case: కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
Kolkata Rape Case : కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ సీల్డ్ కవరులో నివేదికను దాఖలు చేసింది.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Bharat Bandh: ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
Supreme Court: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటా సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులు అని సుప్రీంకోర్టు తన తీర్పులో…
Mayawati: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బచావో సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. దీనికి బీఎస్పీతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి.