Aam Aadmi Party: లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ దొరికింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.‘‘నిజానికి సమస్యలు ఎదురవ్వొచ్చు.. కానీ ఓడిపోదు’’ అంటూ ఆప్ నేత ఆతిశీ కామెంట్స్ చేసింది. అసత్యాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యం మళ్లీ గెలిచిందని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.
కాగా, మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన టైంలో అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది జస్టిస్ భూయాన్ పేర్కొన్నారు.
सत्यमेव जयते 🙏 pic.twitter.com/P1MxKywVli
— AAP (@AamAadmiParty) September 13, 2024