Kejriwal: తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇవాళ ( శనివారం ) భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి న్యూఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టైన ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను మంజూరు చేసినప్పటికీ.. సీబీఐ అరెస్టు చేసిన చట్టబద్ధతపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Read Also: Uttarpradesh : కారు టైర్ పగిలిపోవడంతో ఘోర ప్రమాదం.. పాన్ మసాలా కంపెనీ యజమాని భార్య మృతి
కాగా, కేజ్రీవాల్ బెయిల్‌పై బయటికి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అందరూ బయటకు వచ్చినట్లైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణతో తీహార్ జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రమే ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. అయితే, అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ ట్రై చేసినప్పటికి చర్చలు ఫలించలేదు.. దీంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎన్నికలకు రెండు వారాల ముందు ఆప్ నాయకుడు బయటకు రావడంతో ఈ పార్టీ విజయకాశాలపై ప్రభావం కనించనుంది.