Madrassas: విద్య నేర్చుకోవడానికి మదర్సాలు పనికిరావు.. అక్కడ బోధించే విద్య.. విద్యార్థులకు ఎందుకూ పనికిరాదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR).. సుప్రీంకోర్టుకు పేర్కొనింది. అంతేకాదు.. మదర్సాల్లో బోధించే విద్య.. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)లోని నిబంధనలకు వ్యతిరేకమని కూడా స్పష్టం ఎన్‌సీపీసీఆర్ చేసింది. మదర్సాలు ఆర్‌టీఈ పరిధిలోకి రాకపోవడంతో మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు.. తదితర హక్కులకు స్కూడెంట్స్ దూరం అవుతున్నారని చెప్పుకొచ్చింది.
Read Also: Amazon Great Indian Festival: బిగ్ సేల్‌కు సిద్ధమైన అమెజాన్.. మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు!
ఇక, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో కొన్ని అంశాలను మాత్రమే బోధించి.. విద్యను అందిస్తున్నామని చెబుతూ మదర్సాలు మోసం చేస్తున్నాయని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పేర్కొనింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించింది. విద్యకు మదర్సాలు సరైన స్థలం కాదు. అంతేకాదు.. ఇవి ఆర్‌టీఈ చట్టంలోని సెక్షన్లు 19, 21, 22, 24, 29కి విరుద్ధంగా పని చేస్తున్నాయని కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఎన్‌సీపీసీఆర్ వెల్లడించింది.