Arvind Kejriwal: నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ..
- నేడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచాణ..
- ఇవాళ తుది తీర్పును వెల్లడించనున్న సర్వోన్నత న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇంకా ఊరట దొరకలేదు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ (శుక్రవారం) తుది తీర్పును వెల్లడించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో తీర్పు తేదీని ప్రకటించింది. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు.. బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు ఫైల్ చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: AP CM Chandrababu: వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష .. అధికారులపై ఆగ్రహం
Also Read
అలాగే, మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయలేదని ఆయన తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందో.. వెంటనే సీబీఐ ‘ఇన్స్యూరెన్స్’ అరెస్టుకు పాల్పడిందని పేర్కొన్నారు. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదని న్యాయస్థానికి వివరించారు. మరోవైపు, కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకుపోయింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. లిక్కర్ విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే, సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. జూన్ 27వ తేదీ నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో కేజ్రీవాల్ ఉన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్‌కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?