ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో.. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
Arvind Kejriwal Bail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపశమనం లభించలేదు. మరికొంత కాలం ఆయన జైల్లోనే వేచి చూడాల్సిందే. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా పడింది.
Supreme Court : సుప్రీంకోర్టు ఆవరణలో ఓ న్యాయవాదిపై కోతులు దాడి చేశాయి. కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఆమెకు ఈ ఘటన ఎదురైంది. అకస్మాత్తుగా కోతుల గుంపు ఆమెపై దాడి చేయడంతో గాయపడింది.
Arvind Kejriwal Bail: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తుపై సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం హామీ మేరకు వైద్యులు మెత్తబడ్డారు. సమ్మె విరమించాలంటూ సుప్రీంకోర్టు చేసిన విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ప్రకటించింది.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీం కోర్టు వారికి హామీ ఇచ్చింది.