కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
దేశంలో గత కొన్ని రోజులుగా దేశద్రోహం చట్టం పేరు బాగా వినిపిస్తున్నది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన, వలస తెచ్చుకున్న చట్టం అవసరమా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించే సమయంలో కోర్టు ఈ రకంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే…
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-A ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66-A కింద…
కన్వర్ యాత్రకు యూపీ అనుమతులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సుమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే, ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మహాశివుడి భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్కడి పవిత్రమైన గంగానది జలాలను తీసుకొని వస్తారు. వాటిని స్థానికంగా ఉండే శివాలయంలో మహాశివునికి అభిషేకిస్తారు. ఈ యాత్ర ప్రతి…
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని… తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఈ పిటిషన్ లో పేర్కొంది ఏపీ సర్కార్. read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్… సుప్రీంలో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే…
ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపడం, కొత్త చట్టాలను ఆమోదించడం లాంటి కీలకమైన పనులు చేయాల్సిన చట్టసభల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రశ్నలు.. తిట్లు.. ఇలా ఎన్నో చూస్తుంటాం… ప్రజాప్రతినిధులు వాడే భాష కొన్నిసార్లు వినడానికే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి.. ఇక, నిరసనలు, ఆందోళనలు సరేసరి.. కొన్నిసార్లు అవి శృతిమించి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. పేపర్లు విసురుకోవడం.. మైకులు విసరడం.. ఇలా ఎన్నో ఘటనలు చూశాం.. కానీ, పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల ‘అనుచిత ప్రవర్తన’పై…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా…
తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఈ చర్యలకు పూనుకుంది.. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655…
ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు…