నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్‌నే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. పరీక్ష నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై మండిపడింది… పాత సిలబస్ ప్రకారం టెస్ట్ నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు (బుధవారం) కూడా విచారణ కొనసాగనున్నట్టు తెలిపింది. పాత సిలబస్‌తోనే నీట్-పీజీ నిర్వహణ, టెస్ట్ తేదీలను మార్చే విషయమై తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి ఒక్కరోజు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు.