కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని, మరణ దృవీకరణ పత్రంలో కరోనాతో చనిపోలేదని పేర్కొనడాన్ని కారణంగా చూపించవద్దని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ విపత్తుల సంస్థ సూచించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
Read: బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి పవన్‌ను పిలుస్తాం…