కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని,…
ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్సైడర్ ట్రేడిరడ్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్స్టాప్ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి న్యాయపోరాటానికి ఆస్కారంవుండదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి రాజధాని భూములను టిడిపి పెద్దలు మంత్రులు వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో కొనేసి రైతులకు నష్టం కలిగించారనే ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్సైడర్ ట్రేడిరగ్ అనే స్టాక్…
అమరావతి భూముల వివాదంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆంధ్రప్రదేశ్ మైకోర్టు కొట్టివేయగా… హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది… ఇక, ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది… ఇక, ఏపీ ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసింది సుప్రీంకోర్టు.. దీంతో.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
దేశంలో గత కొన్ని రోజులుగా దేశద్రోహం చట్టం పేరు బాగా వినిపిస్తున్నది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన, వలస తెచ్చుకున్న చట్టం అవసరమా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించే సమయంలో కోర్టు ఈ రకంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే…
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-A ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66-A కింద…
కన్వర్ యాత్రకు యూపీ అనుమతులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సుమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే, ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మహాశివుడి భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్కడి పవిత్రమైన గంగానది జలాలను తీసుకొని వస్తారు. వాటిని స్థానికంగా ఉండే శివాలయంలో మహాశివునికి అభిషేకిస్తారు. ఈ యాత్ర ప్రతి…
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని… తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఈ పిటిషన్ లో పేర్కొంది ఏపీ సర్కార్. read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్…