కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, రోడ్లను దిగ్బంధం చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనికి కారణమైన 43 రైతు సంఘాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సమాధానం చెప్పాలని రైతు సంఘాలను ఆదేశించింది సుప్రీం కోర్టు.
Read: ఐరాసాను టార్గెట్ చేసిన నార్త్ కొరియా… ఎందుకంటే…