ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు, లాయర్లు కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. కోర్టుల భద్రత అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైందన్నారు. కోర్టుల భద్రత అంశంపై వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.శుక్రవారం ఢిల్లీ రోహిణి కోర్టులో తుపాకుల మోత మోగింది. లాయర్ల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని కాల్చి చంపారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
వెంటనే అలర్టయిన పోలీసులు… నిందితులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల మోతతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. మొత్తం 30 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. రూమ్ నెంబర్ 207లో ఈ కాల్పులు జరిగాయి. ఢిల్లీకి చెందిన టిల్లూ గ్యాంగ్ జితేంద్రను హత్య చేసినట్లు తెలుస్తోంది. జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. తన గ్యాంగ్‌ను తుడిచిపెట్టేసిన జితేందర్‌పై కసితో ఉన్న టిల్లు అప్పట్నుంచి పగతో రగిలిపోతున్నాడు. జైలు నుంచే జితేందర్ గోగి హత్యకు కుట్రపన్నాడు. సక్సెస్ అయ్యాడు.
ఈ ఘటనతతో రోహిణీ కోర్టులో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. పటిష్ఠ భద్రత ఉండే కోర్టులోకి తుపాకులు ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. లోపలకు వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అయినప్పటికీ ఆయుధాలు లోపలకు ఎలా తీసుకెళ్లారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్కడ భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కోర్టులోకి ఎవరు వస్తున్నారు, ఏం తెస్తున్నారనేది పోలీసులు ఎప్పుడూ పట్టించుకోరని లాయర్లు కూడా ఆరోపిస్తున్నారు
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!