భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన, పార్లమెంట్ సమవేశాలను కుదిపేస్తోన్న పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది..…
జార్ఖండ్ జడ్జి హత్య కేసులో సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. అయితే, అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరచడం బాధాకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ఇక, జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును నిన్న స్వాధీనం చేసుకుంది సీబీఐ.. జూలై 28న మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయమూర్తి ఆనంద్‌ను ఆటోతో…
రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా.. న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరొక పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, సీపీఎం ఎంపీ జాన్…
పాకిస్తాన్లో మతమార్పిడులు సహజం. అక్కడ ఇతర మతస్థులను ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మారుస్తుంటారు. అయితే, హిందువులు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలో మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ పేరు మతం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్లడంతో ఏటీఎస్ పోలీసులు అతడిని విచారణ జరిపారు. ఎటీఎస్…
కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని,…
ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్సైడర్ ట్రేడిరడ్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్స్టాప్ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి న్యాయపోరాటానికి ఆస్కారంవుండదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి రాజధాని భూములను టిడిపి పెద్దలు మంత్రులు వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో కొనేసి రైతులకు నష్టం కలిగించారనే ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్సైడర్ ట్రేడిరగ్ అనే స్టాక్…
అమరావతి భూముల వివాదంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆంధ్రప్రదేశ్ మైకోర్టు కొట్టివేయగా… హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది… ఇక, ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది… ఇక, ఏపీ ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసింది సుప్రీంకోర్టు.. దీంతో.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు…