దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని ..అప్పటి వరకు న్యాయస్థానం దీనిపై తన సమయాన్ని వెచ్చించవద్దని సోమవారం కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించటంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసింది. దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించే వరకు పౌరుల ప్రయోజనాల పరిరక్షణపై కేంద్రం…
మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది…
ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… కేంద్ర ప్రభుత్వ బుల్డోజర్ డ్రైవ్‌ను నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ ప్రాంతంలోని ముస్లింల నివాసాల కూల్చివేతను ప్రారంభించిందని మండిపడుతున్నారు.. మరోవైపు.. షాహీన్‌బాగ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. కోర్టును ఆశ్రయించినవారిలో బాధితులు లేరని సుప్రీం పేర్కొంది.. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. షాహీన్‌బాగ్‌లో ఆక్రమణల…
ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు, విద్యార్థి విభాగం నాయకుడికి బెయిల్ వచ్చింది.. దీంతో, అతడికి అనుకూలంగా సంబరాలే జరిగాయి… ఏకంగా పోస్టర్లు వెలిశాయి.. అయ్యగారి కీర్తిని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడు బెయిల్ రద్దు చేసింది.. అంతే కాదు వారం రోజుల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడికి బెయిల్…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టుతో పాటు.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లోనూ జడ్జీల నియామకం చేపట్టగా.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు.. గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్శు ధులియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.. ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్.. దీంతో, సుప్రీంకోర్టులో ఉత్తరాఖండ్ నుంచి రెండవ న్యాయమూర్తి కానున్నారు ధులియా. Read Also:…
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని అతడు పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే అంశంలో గతంలో కూడా ధోనీ కోర్టు మెట్లెక్కాడు. ఆమ్రపాలితో నడుస్తున్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ధోనీ తన పిటిషన్లో అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మే 6న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్…
అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు… దేశవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణను సవాల్ చేసిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీం.. కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణను నియమించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగేశ్వరరావు.. అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్న ఆయన.. అనియంత్రిత…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కోర్టులో లొంగిపోయాడు. లఖింపూర్‌లో వ్యవసాయ చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న రైతులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు సహా మొత్తం 8 మంది మృతికి కారకుడయ్యాడంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆశిష్ మిశ్రాపై…
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చింది సుప్రీం.. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సీరియస్‌గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసిందని.. ఆంద్రప్రదేశ్…