సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వరవరరావు బెయిల్ పిటిషన్‌ను గురువారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ చేపట్టనుంది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావును మహారాష్ట్ర పోలీసులు చాలా కాలం క్రితమే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు వరవరరావు పిటిషన్లు దాఖలు చేసినా ఆయనకు అనుకూలంగా తీర్పు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో 82 సంవత్సరాల వయసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఇప్పటి వరకు విచారణ జరపడం లేదని వరవరరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. తాము దాఖలు చేసిన పిటిషన్ త్వరగా విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టును వరవరరావు తరపున న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ప్రస్తావించగా.. విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.
అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా వరవరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. వరవరరావు ప్రస్తుతం పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. .
అసలు నేపథ్యం ఇది: 200 ఏళ్ల కింద జరిగిన బీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గర్ పరిషత్తు నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరికి అల్లర్లకు దారి తీసింది. మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుకా మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్ అల్లర్లకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో ఢిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్, రోనా జాకొబ్, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్ పరిషద్‌కు చెందిన సుధీర్ ధవాలె, షోమ సేన్, మహేష్ రౌత్, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు.
Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు