Supreme Court: మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడికి మరణ శిక్షను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ సమర్థించింది. అత్యంత దారుణంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు పాశవికంగా హత్య చేయడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరం క్రూరమైనదని..అమానవీయమని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వికలాంగురాలైన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మనోజ్ ప్రతాప్ సింగ్ కు రాజస్థాన్ హైకోర్ట్ విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించింది.
న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ కుమార్ లతో కూడిన ధర్మాసనం మనోజ్ ప్రతాప్ సింగ్ ను దోషిగా నిర్థారిస్తూ ఉరిశిక్షను సమర్థించింది. రాజస్థాన్ హైకోర్ట్ విధించిన మరణశిక్షను సవాల్ చేసిన మనోజ్ ప్రతాప్ సింగ్ అప్పీల్ ను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. స్వీట్స్ కొనిస్తాననే నమ్మించి, అమాయక బాధితురాలని దొంగలించిన స్కూటర్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఆరోపణలపై నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 363, 365, 376(2)(ఎఫ్), 302 తో పాటు పోక్సో చట్టాల కింద అభియోగాలు నమోదు అయ్యాయి. సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి మరణ శిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించింది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
నిందితుడు, ఏడున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, బాధితురాలి తలను అత్యంత దారుణంగా పగలగొట్టి చంపాడని..ముందరి ఎముకలో అనేక పగుళ్లు ఏర్పడ్డాయని.. మరణశిక్ష కన్నా తక్కువస్థాయి ఏ శిక్షకు కూడా నిందితుడు అర్హుడు కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. జీవిత ఖైదు విధింపు కూడా సమర్థనీయంగా అనిపించడం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ నేరంతో పాటు గతంలో నాలుగు నేరాల్లో నిందితుడు పాలుపంచుకున్నట్లు సుప్రీం వెల్లడించింది. నిందితుడు మనోజ్ ప్రతాప్ సింగ్ , పండ్లు కూరగాయలు అమ్ముకుంటున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏడున్నరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశాడు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!