దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన…
కాంగ్రెస్ లీడర్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. 20 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 1988 జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి మరణించిన కేసులో సిద్దూకు సుప్రీంకోర్ట్ గురువారం ఒక సంవత్సరం జైలు శిక్షను విధించింది. ఈ కేసులో సిద్దూకు నేరం చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్ట్ మే 18, 2018న రూ. 1000…
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా చేపట్టిన సర్వేలో శివలింగం బయటపడడం పెద్ద చర్చగా మారింది.. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడింది.. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.. ఇక, ఈ కేసులో వారణాసి కోర్టు విచారణ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. జ్ఞానవాపి మసీదు కేసును శుక్రవారం…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. ఆ కేసులో దోషిగా ఉన్న పేరారివాలన్ 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో 31 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు ఈ…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలను జారీ చేసింది. వారణాసి కోర్ట్ లో మొదటి…
కొన్ని సినిమాలు వినోదం మాత్రమే పంచవు.. విలువలు నేర్పిస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మనుషులలో మార్పును తీసుకొస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రజల జీవితాలనే మార్చేస్తాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’చిత్రం అదే తరహా లిస్టులోకి చేరింది. అప్పుడెప్పుడో మహర్షి సినిమా చూసి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ సండే వ్యవసాయం అంటూ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేశారు.. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ లో తీర్పు…
నీట్ పీజీ- 2022 పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అటు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని,…
చట్టాలు కొందరికే చుట్టాలు. మన దేశంలో చాలా ఈజీగా ఈ కామెంట్ పాస్ అవుతూ ఉంటుంది. దీనికి కారణాలు లేకపోలేదు. చట్టాల అమలు తీరు అలా ఉంటుంది. రాజకీయ, వ్యక్తిగత కక్షలకు దుర్వినియోగం అయ్యే చట్టాలు అనేకం. వీటిల్లో కొన్ని ప్రమాదకర చట్టాలు కూడా ఉంటాయి. ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శతాబ్దాల క్రితం బ్రిటిషర్లు రూపొందించిన IPCలో కొన్ని సెక్షన్లు ఇప్పటికీ భారతీయులకు ఉరితాడుగానే ఉన్నాయి. అందులో 124A ఒకటి. తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ…
దాదాపు 150 ఏళ్ల నాటి రాజద్రోహ సెక్షన్ 124ఏ చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా మోదీ సర్కారు ఎన్ని ట్రిక్కులు వేసినా, చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష పూర్తయ్యి, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ చట్టంకింద ఎటాంటి కేసులు, చర్యలు తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రస్తుతం…
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం…