Maharashtra Politics : రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మహా రాజకీయం జరుగతోంది. రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. అయితే శివసేన రెబల్ ఎమ్మెల్యేతో కొత్ పార్టీని ఏర్పాటు చేస్తామని, మాదే అసలైన శివసేన అంటూ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే ప్రకటనలు చేశారు. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత వేటు వేశారు. అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఆ నోటీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఏక్‌నాథ్‌షిండే సహా 16 రెబల్ ఎమ్మెల్యేలకు ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రెబల్ ఎమ్మెల్యేకు మద్దతుగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ముంబైలో న్యాయపరమైన పరిష్కారాలను కొనసాగించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని ఆ వర్గం తెలపడమే కాకుండా.. వారికి నోటీసులు జారీ చేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న నీరజ్ కిషన్ కౌల్ కోర్టుకు వివరించారు.
రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్న విషయం గురించి కూడా కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మూడు రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని తెలిపింది సుప్రీంకోర్టు. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాకుండా రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.
Also Read
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!