సుప్రీంకోర్ట్ పనివేళలు మారతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఇదే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జడ్జిలు కేసులపై విచారణలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ఓ గంట ముందే విచారణలు ప్రారంభించింది. వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ ముకుల్…
దేశంలో వివాదాస్పదం అయిన హిజాబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం నుంచి దీనిపై విచారణ చేపడుతామని, వచ్చేవారం లిస్ట్ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కర్ణాటక హైకోర్టు, స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం…
సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నో చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే వేసిన పిటిషన్ పై అత్యవసర విచారణను సుప్రీం తోసిపుచ్చింది. మహారాష్ట్రలో యథాతద స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అనర్హత ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఈ విషయాన్ని స్పీకర్ కు తెలియజేయాలని సొలిసిటర్…
కోర్టు ధిక్కార నేరం కింద పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ 40 మిలియన్ల అమెరికన్ డాలర్లను విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన కేసులో సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 9వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా విదేశాల్లో ఉన్న ‘డియాజియో’ కంపెనీ బ్యాంకు…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును జూలై 4కు వాయిదా వేసింది. దీంతో…
ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయి, పార్టీని కోల్పోయే పరిస్థితికి ఉద్ధవ్ ఠాక్రేకు ఏర్పడింది. మెజారీటీ ఎమ్మెల్యేలు సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తుండటం, మూడింట రెండొంతుల మెజారిటీ ఏక్ నాథ్ షిండేకు ఉంది. వరస ఎదురుదెబ్బలు తగులుతున్న శివసేన, ఉద్ధవ్ వర్గానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు, సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు, 15 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను గట్టిగా మందలించింది సుప్రీం కోర్ట్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది నుపుర్ శర్మ. తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జేబీ పార్థీవాలా ఈ కేసుపై విచారిస్తూ నుపుర్ శర్మకు అక్షింతలు వేశారు.…
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బల నిరూపన చేసుకోవాలని ఆదేశించడంతో రాజకీయం రసవత్తంగా మారాయి. ఇప్పటికే గౌహతిలో ఉన్న శివసేన రెబెల్స్ గోవాకు వెళ్లనున్నారు. గోవా లోని తాజ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ లో రెబెల్ ఎమ్మెల్యేలకు 70 రూమ్ లు బుక్ చేసినట్లు సమాచారం. గురువారం ఫ్లోర్ టెస్ట్ ఉండటంతో గోవా నుంచి నేరుగా రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకు రానున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్…