అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. మహిళలందరూ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు అర్హులేనని.. ఈ విషయంలో వివాహిత, అవివాహిత మహిళ మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం సుప్రీంకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయింది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం మొదలైంది.
Supreme Court On shivsena party issue: మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కొనసాగుతోంది. అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్నకు ఇక కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం ఇవ్వనుంది. తాజాగా సుప్రీంకోర్టులో మాజీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తాకింది. శివసేన పార్టీపై ఇటు ఏక్ నాథ్ షిండే వర్గం, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే తాజాగా మంగళవారం రోజు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Supreme Court: సుప్రీంకోర్టులో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు ఊరట లభించింది. గుజరాత్ వడోదర రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట కేసును కొట్టివేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ‘రాయిస్’ సినిమా ప్రమోషన్లో భాగంగా షారూఖ్ తన చిత్రబృందంతో కలిసి 2017లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూఖ్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో…
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
టీవీ ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సీరియస్ అయ్యింది సుప్రీంకోర్టు.. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, విద్వేష ప్రసంగాలను సహించేదిలేదని పేర్కొంది.. అయితే, అలాంటి వాటిని ఆపాల్సిన బాధ్యత టీవీ యాంకర్లదేనని స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకుడిగా ఎందుకు మిగిలిపోయింది అని ప్రశ్నించింది.. ద్వేషపూరిత ప్రసంగాలపై టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు యాంకర్ పాత్ర చాలా ముఖ్యమైనది అని పేర్కొంది. Read Also: Chhello show: ఆ…
Live streaming Of Supreme Court Constitution Bench Hearings: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారించే అన్నీ కేసుల విచారణను తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజు సుప్రీంకోర్టు తన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ ధర్మాసనం…