Bandi Sanjay Responds On Supreme Court Verdict on Demonetisation: నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మరోసారి ఐదుగురు జడ్జీల ధర్మాసనం తీర్పు నిరూపితం చేసిందన్నారు. ఈ దేశంలో సంపద కొందరి వ్యక్తుల వద్ద నిక్షిప్తం కాకుండా.. ప్రతీ పేదేళ్లకు ఒకసారి నోట్లు రద్దు చేసి, కొత్త నోట్ల ముద్రణ చేయాలని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్‌కు ప్రతిపాదన చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాన్ని నోట్ల రద్దు నిర్ణయంతో మోడీ ఆచరణలో చూపెట్టారన్నారు.
Bandla Ganesh: నిజమైన పవన్ ట్యాలెంట్ ను బయటకు తీసింది నేనే.. గురూజీ బరూజీ ఎవడు..?
దేశంలో మితిమీరిన అవినీతిని అదుపులో పెట్టేందుకు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు, స్వచంద సంస్థల ముసుగులో మన దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూసిన పాకిస్థాన్ లాంటి తీవ్రవాద ప్రేరిపిత దేశాల నుండి వచ్చే నల్ల ధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయని అన్నారు. మోడీ అద్భుత పాలనని బలహీనపరిచేందుకే.. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆ పిటిషన్లను దాఖలు చేశారన్నారు. ఎందరో నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారని చెప్పారు.
Umran Malik: షోయబ్ అఖ్తర్ రికార్డ్‌ని తప్పకుండా బద్దలుకొడతా
అయితే.. ఆనాడు నోట్ల రద్దు విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ, దాఖలైన 58 పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిందని బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. అది దేశ ప్రయోజనాల కోసమేనని సుప్రీం తీర్పుతో మరోసారి తేలిపోయిందన్నారు. నోట్ల రద్దు ఫలాలు.. ఈ దేశ ఆర్థిక, దేశ భద్రత విషయంలో మన కళ్ల ముందు కనిపిస్తుందన్నారు.