Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ నజీర్ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండటాన్ని నొక్కి చెప్పారు. లింగ అసమానతల భారత న్యాయవ్యవస్థలో కూడా ఉందని ఆయన అన్నారు. సీజేఐ చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో సుప్రీంకోర్టు ప్రస్తుత కాలంలోని అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి, మార్పుకు ఎల్లప్పుడు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Read Also: Revanth Reddy : పీసీసీ రాజీనామాకు నేను సిద్ధం
నేటితో జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం ముగిసింది. సుప్రీంకోర్ట బార్ కౌన్సిల్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పారు. ‘‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ ధర్మం పరమం వదన్తి’’ అంటూ దాని అర్థాన్ని తెలియజేశారు. ప్రపంచంలోని ప్రతీదీ ధర్మంపై స్థాపించబడుతుంది. అందుకే ధర్మం అంతిమ సర్వోన్నతమైనదని.. ధన్యవాదాలు తెలుపుతూ.. జైహింద్ చెప్పారు.
ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ నజీర్. రాజకీయంగా దేశంలో ఎంతో సున్నితమైన అయోధ్య భూ వివాదం, త్రిపుల్ తలాక్, గోప్యత హక్కు మొదలైన కేసుల్లో తీర్పులు ప్రకటించిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. అయోధ్య వివాదంలో మెజారిటీ వర్గం మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజమైన లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నారు. ముస్లిం మహిళల హక్కులను దెబ్బతీస్తున్న త్రిపుల్ తలాక్ ను విచారించిన రాజ్యాంగధర్మాసనంలో కూడా నజీర్ ఉన్నారు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన తీర్పులో భాగంగా ఉన్నారు.