Supreme Court: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి మినహా ఎలాంటి అదనపు ఆంక్షలను పౌరుడు ఎవరైనా సరే విధించరాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
సమిష్టి బాధ్యత సూత్రాలను ప్రయోగించడం ద్వారా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని.. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా హక్కు దృష్ట్యా ఈ తీర్పు వెల్లడిస్తున్నామని ధర్మాసనం తీర్పు చెప్పింది.. పౌరుల హక్కులకు విరుద్ధంగా ఒక మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగ హింసగా పరిగణించబడదని పేర్కొంది.. అలాగే ఆ మంత్రి చేసిన ప్రకటనను మొత్తానికి ప్రభుత్వానికి కూడా ఆపాదించలేమని తెలిపింది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో భాగమైన జస్టిస్ వి.రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా హక్కుకు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ ప్రైవేట్ వ్యక్తులు, రాష్ట్రేతర వ్యక్తులపై కూడా ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగం కింద పేర్కొన్నవి తప్ప వాక్‌స్వేచ్ఛపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని ఆయన తెలిపారు.జస్టిస్ బీవీ నాగరత్నం మాట్లాడుతూ.. “ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహిస్తారు. తోటి పౌరుల కోసం వారు చూపుతున్న ఉదాహరణలను తప్పక తెలుసుకోవాలి. వాక్ స్వాతంత్ర్య హక్కుకు వ్యతిరేకంగా ఎలాంటి అదనపు పరిమితి విధించబడదు.” అని అన్నారు.
మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ బీవీ నాగరత్నం విభేదించారు. నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమన్నారు. పార్లమెంటు ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలదని… అందుకు ఒక ప్రవర్తన నియమావళి వారు రూపొందించుకోవాలన్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు. నేతల విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బ అంటూ తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమన్నారు.
IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 6ఏళ్ల కిందట జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నాటి యూపీ మంత్రి, ఎస్పీ నేత ఆజాం ఖాన్ స్పందిస్తూ.. ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని, అంతకుమించి ఏం లేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బాధిత కుటుంబం సుప్రీం కోర్టులో ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆపై కోర్టు, ఖాన్‌ను క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటన సమయంలో భావప్రకటన స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం తరపున బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. అలా మాట్లాడడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. సీనియర్ న్యాయవాదులు ఫాలి ఎస్ నారిమన్, హరీష్ సాల్వే రూపొందించిన కొన్ని అభ్యంతరాల దృష్ట్యా.. 2017లో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!