రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికార పరిమితులపై సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని నిర్దేశించిన కేశవానంద భారతిలోని సెమినల్ తీర్పు సోమవారంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దశాబ్దాలుగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం పదేపదే విమర్శించబడింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
YS Viveka Case: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై వివేకా కూతురు సునీత.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు వాదనలు ముగిశాయి.. సుప్రీంకోర్టులో సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వానదలు విన్న…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 28న విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అతీక్ అహ్మద్ (60), అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది తీసుకువెళుతుండగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టింది అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టిన 8 మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులకు కోర్టు నుండి ఉపశమనం లభించింది. ఈ దోషులందరికీ 17 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె.. అయితే, ఈ కేసు రేపు విచారించనుంది…