సుప్రీం కోర్టులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
స్వలింగ వివాహాలను గుర్తించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే దేశంలోని పలు మైనారిటీ మత సంస్థలు అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా జమియత్ ఉలమా-ఐ-హింద్ స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ రోజు పాటియాలా సెంట్రల్ జైలు నుండి విడుదల అవుతున్నారు. 34 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని హత్య కేసులో సిద్ధూను సుప్రీంకోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.
జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నలుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుపై రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది.
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది.
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎంఆర్ షా.. అయితే, తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసింది సీబీఐ.. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది.. కాగా,…