సుప్రీంకోర్టు నిర్ణయం పవిత్రమైన నిర్ణయం అని అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని రకాలుగా ఆలోచించాకే అప్పట్లో సిట్ ఏర్పాటు చేశాం.దీనిని టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు. రాష్ట్ర సంపదనను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. దేశంలోనే అతిపెద్ద స్కాం అమరావతి భూకుంభకోణం అన్నారు. అన్ని విషయాలు బయటకు వస్తాయి. రింగురోడ్డు స్కాం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందన్నారు సజ్జల.
రాజధాని అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ టచ్ చేసినా స్కాంలే ఉన్నాయి.. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి.. చంద్రబాబు, లోకేష్ లకు భయం ఎందుకు? ఈ స్కాంలలో అరెస్టులు కూడా జరుగుతాయి. వారు కోర్టులకు వెళ్తే మేము అదేస్థాయిలో పోరాటం చేశాం. ఏంపీకుతారని మాట్లాడటం ఎందుకు? త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. సభాసంఘం ఇచ్చిన అంశాలపై విచారణ జరుగుతుంది. ఇందులో కక్ష సాధించేదేమీ లేదు. మాకు అవసరం లేదు అన్నారు సజ్జల. పైపైన రాజకీయాల కోసం మేము విచారణ చేయటం లేదు.
Read Also: Challan: ఇదేమీ విడ్డూరం.. సీట్‌బెల్ట్ ధరించలేదని టూ వీలర్ యజమానికి రూ.1000 జరిమానా!
పక్కాగా ఆధారాలు ఉన్నందునే సిట్ విచారణ చేస్తోంది. కుంభకోణాలు జరిగాయన్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు. లోతుగా వెళ్లాల్సిన పనిలేదు. ఎక్కడ పట్టుకున్నా దొరుకుతారు.. జనాన్ని ఫూల్స్ చేసి 30 వేల ఎకరాలు తీసుకున్నారు.. రైతులను నిలువునా ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారు . తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతి చేశారు.. అందుకే వాటిపై విచారణ అనగానే భయపడుతున్నారు.. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తాం అన్నారు. బాలినేని ఇతర కారణాల వలన కోఆర్డినేటర్ గా చేయలేనన్నారు. ఆయన తన నియోజకవర్గంలో పనులు చూసుకోవాలన్నారు.. ఎన్నికలు రాబోతున్నందున అన్నీ చూసుకోవాలి కదా? వివాదాలు అంటూ మీడియా చేసే హడావుడే తప్ప మరేమీ లేదు.. టీ కప్పులో తుఫాను కూడా కాదు…అసలు కప్పులో టీ నే లేదు అన్నారు సజ్జల.
Read Also: Ramabanam: బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి: జగపతిబాబు