Death Penalty: ఉరితీసే విధానంపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం ఉరితీసే విధానం అమలులో ఉంది. అయితే దీన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయిన కేంద్రం తరుపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు.
Supreme Court: విడాకుల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వైవాహిక బంధం కోలుకోలేని విధంగా దెబ్బతింటే ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Supreme Court On Atiq Ahmad killing: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నల్ని సంధించింది. అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్న సందర్భంలో దుండగులు హత్య చేశారు. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు కోరతూ న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసి పిటిషన్…
కర్ణాటక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు.. మే 9వ తేదీ వరకు ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేసే ప్రక్రియలో కర్ణాటక ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని ఆదేశించింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కోసం నిరసన తెలిపిన రెజ్లర్ల అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరింది. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ మహిళా రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికార పరిమితులపై సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని నిర్దేశించిన కేశవానంద భారతిలోని సెమినల్ తీర్పు సోమవారంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దశాబ్దాలుగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం పదేపదే విమర్శించబడింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
YS Viveka Case: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై వివేకా కూతురు సునీత.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు వాదనలు ముగిశాయి.. సుప్రీంకోర్టులో సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వానదలు విన్న…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 28న విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అతీక్ అహ్మద్ (60), అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది తీసుకువెళుతుండగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే.