Supreme Court : లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్ల ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధర్నా చేస్తున్న రెజ్లర్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రొసీడింగ్స్ కి కోర్టు స్వస్తి చెప్పింది. వీటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మీరు దిగువ కోర్టుకు వెళ్లాలని రెజ్లర్లకు సూచించింది.
Read Also:Karnataka Elections: కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారం.. ఏ పార్టీ తరుపున అంటే..?
బ్రిజ్ భూషణ్ పై రిటైరయిన, లేదా ప్రస్తుత హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ చేయించాలన్న రెజ్లర్ల తరఫు లాయర్ అభ్యర్థన మీద విచారణకు సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ నిరాకరించింది. బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ దాఖలయ్యేట్టు చూడాలని మీరు కోరారని, ఆ మేరకు అతనిపై అది నమోదైందని కోర్టు పేర్కొంది. తమను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని ముగ్గురు మహిళా రెజ్లర్లు అతనిపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరి విజ్ఞప్తి ఆధారంగా అతనిమీద ఎఫ్ఐఆర్ నమోదు కావడమే కాకుండా ఏడుగురు రెజ్లర్లకు సెక్యూరిటీని కూడా కల్పించినందున ప్రొసీడింగ్స్ ని నిలిపివేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
Read Also:Ponguleti Srinivas Reddy : పొంగులేటి, జూపల్లితో కొనసాగుతున్న బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీ
రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశంలోని చాంపియన్ల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. అధికారం నుంచి బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘దేశంలోని చాంపియన్ ప్లేయర్లతో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం విచారకరం, సిగ్గుచేటు. ఈ వ్యక్తులు మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారు. మొత్తం వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. ఇకపై దేశంలోని ప్రజలు బీజేపీ గూండాయిజాన్ని సహించొద్దు.. బిజెపిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.