Maharashtra Political Crisis: మహా ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా..? నేడు సుప్రీం కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.
గతేడాది శివసేనలో చీలిక తీసుకువచ్చి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు, బీజేపీ సహకారంతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక వేళ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత ప్రకటిస్తే అతను రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం రద్దు చేయబడుతుంది.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
Read Also: karnataka Exit Poll: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేసింది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మద్దతుగా కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించగా, ఏక్నాథ్ షిండే శిబిరం తరఫున హరీష్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జెఠ్మలానీలు వాదించారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఒక రోజు ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే 288 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార శివసేన-బీజేపీ కూటమికి 184 ప్లస్ ఓట్లు ఉన్నాయని, అవసరమైతే తమ మెజారిటీని నిరూపించుకుంటామని అన్నారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం అని, చట్టం మన వెంటే ఉంటుందని అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శివసేన పార్టీని, పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే అనే పేరు, మండుతున్న కాగడాను గుర్తుగా ఇవ్వబడింది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!