ఈ సమ్మర్ లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్, మేలో ఎండలు మరింత మండిపోనున్నాయి. దీంతో వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా అవుతుంది.
గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రలలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాలలో మార్చి నెలలోనే ఎండ దంచి కొడుతోంది. మార్చి రెండో వారంలోనే వేసవి తాపం ఎక్కువైంది.
Summer : మార్చి నెల ప్రారంభమై పది రోజులు కూడా కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Summer Tips: వేసవి వచ్చిందంటే శారీరకంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బలహీనత మొదలైనవి వస్తాయి.
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80…
వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోకి రేపు (సోమవారం) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో…
తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఇటీవల కొన్నిరోజులు చల్లబడిన వాతావరణం భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఖమ్మం జిల్లా మధిరలో 43.9 డిగ్రీల సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ జిల్లా గార్లలో…
ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యులను అష్టకష్టాలు పెడుతున్నాయి. అయితే తామేం తక్కువ కాదు అన్నట్లు చికెన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డులు తిరగరాస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.312కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అటు తెలంగాణలో కిలో స్కిన్…