ఈ సమ్మర్ లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్, మేలో ఎండలు మరింత మండిపోనున్నాయి. దీంతో వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా అవుతుంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే మార్కెట్‌లో ఎయిర్ కండీషనర్లు, ఎయిర్ కూలర్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్లాన్లకు డిమాండ్ పెరిగింది.
Also Read:
World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
ఎయిర్ కూలర్ కొనే ముందు మీ గది సైజ్, వాటర్ ట్యాంక్ కెపాసిటీ లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు మార్కెట్‌లో కొనాలనుకున్నా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలన్నా మీ అవసరాలకు సరిపడా ఎయిర్ కూలర్ సెలెక్ట్ చేయాలి. కూలర్లలో ఈ రెండు రకాలుంటాయి. రూమ్ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. పొడి వాతావరణంలో అయితే డిసర్ట్ కూలర్స్ బాగా పనిచేస్తాయి.
ఏసీల్లో రకాలు ఉన్నట్టుగానే ఎయిర్ కూలర్‌లో కూడా వేర్వేరు రకాలుంటాయి. పర్సనల్ కూలర్, విండో కూలర్, డిసర్ట్ కూలర్ అని వేర్వేరుగా ఉంటాయి. మీ గది చిన్నగా ఉన్నా, ఇంట్లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేప్పుడు ఉపయోగించాలన్నా పర్సనల్ కూలర్ చాలు. ఈ చిన్న కూలర్ 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్ గదిని కవర్ చేస్తుంది. బెడ్‌రూమ్‌లో లేదా హాల్‌లో కిటీకీ దగ్గర్లో పెట్టాలనుకుంటే విండో ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఇది పర్సనల్ కూలర్ కన్నా కాస్త పెద్దదిగా ఉంటుంది. ఇక మీ రూమ్ సైజ్ పెద్దగా ఉంటే డిసర్ట్ కూలర్ తీసుకోవడం మేలు. డిసర్ట్ కూలర్ పెద్ద గది మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇక, కూలర్ నుంచి వచ్చే సౌండ్ నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందుకే నాయిస్ లెవెల్ ఎంతో చెక్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
Also Read:Ram Charan: ఇండియా తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్… సాయంత్రం మోదీతో మీటింగ్
మీరు చల్లగా ఉంచాల్సిన ప్రాంతాన్ని తెలుసుకోవడం ద్వారా మీ గది లేదా మీ కార్యాలయ పరిమాణానికి తగిన నాణ్యమైన మినీ ఎయిర్ కూలర్‌ను మీరు ఎంచుకోవచ్చు. ఒక చిన్న ఎయిర్ కూలర్ చాలా చల్లని గాలిని త్వరగా మరియు సమర్ధవంతంగా అందించగలదు. వేసవిలో మీకు సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గం అవసరమైతే, వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా చిన్న గదిని చల్లబరచడానికి ప్రత్యేకమైనది కావాలంటే స్టైలిష్ మినీ కూలర్ ఒక గొప్ప ఎంపిక.