ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని…
Temperatures in AP have been rising since the beginning of summer వేసవి కాలం కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఆదిలోనే భానుడు భగభగ మంటున్నాడు. మొన్నటి వరకు శీతాకాలం పిల్లగాలులతో సేదతీరిన ప్రజలు ఇప్పుడు రుద్ర రూపం ఎత్తబోతున్న సూర్యుడి ప్రతాపాగ్ని జ్వాలలకు చెమటలు కక్కనున్నారు. అయితే ఎండాకాలం ప్రారంభంలోనే ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీలకు వరకు నమోదవుతోంది.…
వేసవి ప్రారంభానికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వినియోగంలో ఆల్‌టైమ్ రికార్డు త్వరలో నమోదుకానుందని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. దింతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణలో కరెంటు డిమాండ్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గర్లో ఉంది. గత ఏడాది మార్చి చివర్లో 13 వేల 688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను అధిగమించింది. అయితే గతేడాది మార్చి 4న అత్యధికంగా నమోదైన విద్యుత్ డిమాండ్.. ఈ ఏడు ఇప్పటికే అధికమించింది. ఈనెలాఖరులోగా…
తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చేసింది. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సోమవారం తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2…
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యాదీవెన కిట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల్లోనే విద్యాదీవెన కిట్లను స్కూళ్లకు చేర్చాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. అందుకు అవసరమైన టెండర్ల ఖరారు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలతో సకాలంలో ఒప్పందాలు పూర్తిచేసుకుని వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించారు. Read Also:…
ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండాకాలంలో కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అలాగే చాలా అసౌకర్యంగా అన్పిస్తుంది కూడా. అయితే ఈ సమస్యను నివారించడానికి అనేక సింపుల్ గా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కాలు అధిక చెమటను నిరోధించడానికి బాగా పని చేస్తాయి. ప్రతిరోజూ ఇంట్లో తయారు చేసిన ఒక గ్లాసు తాజా టమాట జ్యూస్ తాగండి. ఇది చెమటను తగ్గిస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కూడా…