తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఇటీవల కొన్నిరోజులు చల్లబడిన వాతావరణం భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఖమ్మం జిల్లా మధిరలో 43.9 డిగ్రీల సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ జిల్లా గార్లలో 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
అటు ఖమ్మం జిల్లా సింగరేణిలో 43.4 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో 43.4 డిగ్రీల సెల్సియస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 43.4 డిగ్రీల సెల్సియస్, హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లో 43.3 డిగ్రీల సెల్సియస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో 43.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మం జిల్లా చింతకానిలో 43.3 డిగ్రీల సెల్సియస్, జనగామ జిల్లా చిల్పూరులో 43.3 డిగ్రీల సెల్సియస్, హన్మకొండ జిల్లా ఖాజీపేటలో 43.2 డిగ్రీల సెల్సియస్, ములుగు జిల్లా తాడ్వాయిలో 43.2 డిగ్రీల సెల్సియస్, ఖమ్మం అర్బన్‌లో 43.2 డిగ్రీల సెల్సియస్, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 43.1 డిగ్రీల సెల్సియస్, కరీంనగర్ జిల్లా వీణవంకలో 43.1 డిగ్రీల సెల్సియస్, నల్గొండ జిల్లా కనగాలలో 43.1 డిగ్రీల సెల్సియస్, ఖమ్మం జిల్లా ముదిగొండలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.