నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు…
అప్రమత్తంగా వుండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నా జనం మోసపోతూనే వున్నారు. ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా, ఓటిపి గురించి అడిగినా వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తూనే వున్నారు. అటువంటి కేటుగాళ్ళ కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు కూడా చేశారు తెలంగాణ పోలీసులు. ప్రజలను మోసంచేసి డబ్బులు కాజేస్తున్న వారిపై వేటు వేస్తూ.. కఠిణ శిక్షలు అమలు చేస్తున్నా అలాంటి కేటుగాళ్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అయితే.. అటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా…
ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్ వాల్యూపరంగా చూస్తే గత…
* ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. దేశవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న కార్మికులు. * నేడు జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ అంత్యక్రియలు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి రానున్న హోం మంత్రి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని *పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి రోజా పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రోజా. మార్టేరులో జరుగుతున్న బాస్కెట్ బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా *తిరుపతిలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో…
వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో…
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఇవాళ ఢీకొడుతున్నాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.…
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే మండు వేసవిలో ఓ గ్లాస్ చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. చెరుకులో పిండి పదార్థాలు, మాంసకృతులతో పాటు ఐరన్, జింక్, పొటాషియం, పాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా దాగి ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి కూడా శరీరానికి లభిస్తాయి. వేసవిలో…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సుమారు రెండు నుంచి మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని హైదరాబాద్…