ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టీవ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవితో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి.
ఎండాకాలంలో దాహం బారినుంచి బయటపడాలంటే ఓ కొబ్బరి బోండా తాగితే చాలు. ఇట్టే దాహం తీరిపోతుంది. అంతేకాకుండా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇలా కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మాములుగా కొబ్బరినీళ్లు నీరసంగా ఉన్నా, లేదంటే జ్వరం వచ్చినా తాగితే తొందరగా కోలుకోవచ్చు.
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ లాంటిది. చికెన్ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉండగా.. స్కిన్ చికెన్ కు రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 48 గంటల్లో కేరళలోకి రుతుపవానాలు ప్రవేశించనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
Summer heat: మూడో రోజు వరకు అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రజలు వేసవిని ఆస్వాదించారు. ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు జనం వణికిపోతున్నారు.
Sun will be high: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.
AC Side Effects: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9అయితే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం అయ్యిందంటే ఎండ భగ్గుమంటుంది.ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. ఇక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా ప్రజలు నిమిషం కూడా ఉండలేని పరిస్థితి.
Avoid food: వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ తర్వాత మళ్లీ ఈ పండ్లను తినాలంటే వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిందే. అందుకే చాలా మంది మామిడి పండ్లను ఎక్కువగా తింటారు.