Chicken Prices: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ లాంటిది. చికెన్ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉండగా.. స్కిన్ చికెన్ కు రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. అటు ఏపీలోనూ చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Read Also: LIC Saral Pension: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..జీవితాంతం పెన్షన్ పొందవచ్చు..
హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో చికెన్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. సాధారణంగా వేసవిలో విపరీతమైన వేడి లేదా ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోవడం, చికెన్ సరఫరా లేకపోవడం వల్ల ధరలు పెరుగుతుంటాయి. అయితే, ఇప్పటివరకు కొనసాగిన వేసవి పరిస్థితులు, పెళ్లిళ్లు, దావత్ ల సీజన్ కారణంగా చికెన్ ధరలు కొండెక్కాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు మారుతూ వస్తున్నాయి. నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేనిది ముద్ద దిగదు అన్నట్లుగా.. గత ఆదివారం హైదరాబాద్ లో 50 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయినట్లు చికెన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్, డీఎంకేలు 2G, 3G, 4G పార్టీలు.. అమిత్ షా ఫైర్
అటు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల బ్రాయిలర్ చికెన్ ధరలు మండిపోతున్నాయి. అక్కడ కూడా కిలో 350 వరకు పెరిగాయి. మండే ఎండలు పౌల్ట్రీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీయడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు వారాల్లో ఎండల తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్‌లో బోన్‌లెస్ చికెన్ ధరలు కిలోకు 500 నుండి ₹600 వరకు ఉన్నాయి. 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రతిరోజూ కనీసం 20 శాతం కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ వర్గాలు తెలిపాయి.