AC Side Effects: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9అయితే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం అయ్యిందంటే ఎండ భగ్గుమంటుంది.ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. ఇక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా ప్రజలు నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా మేలో ఎండలు పెరిగి ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో చాలామంది ఏసీ రూముల నుంచి బయటకు కూడా రావడం లేదు. ఇకపోతే ఏసీ చల్లని గాలి అన్ని వయసుల వారిని కూడా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఏసీ మనకు తాత్కాలిక ఆహ్లాదాన్ని కల్పించినప్పటికీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also:Raviteja: పాపం.. రవితేజకు ఆకలి కాదా.. అందుకే అలా అవుతున్నారా ?
ఎప్పుడైతే ఏసీ కి బాగా అలవాటు పడిపోయారో.. అప్పుడే వారి ఆరోగ్యం కూడా మరింత దిగజారి పోతోందంటున్నారు. ఇకపోతే ఈ అలవాటు మీ ఆరోగ్యానికే ప్రమాదకరమని మీకు తెలుసా.? చాలామంది ఏసీని వదలలేకపోతున్నారు. ఏసీ ని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల శరీరానికి చాలా పెద్ద నష్టం కలుగుతుంది. మరీ ఎక్కువగా ఈ వేసవి కాలంలో ఏసీ కింద ఉండడం వల్ల తలనొప్పి, జలుబు, దగ్గు, వికారం, పొడి చర్మంతో సహా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి.
Read Also:Arya: ఈ సినిమా గొడవలకి కారణం అయ్యేటట్లు ఉందే…
అందుకే ఏసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఏసీ ఉపయోగించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురై, చర్మం పొడిబారుతుంది. సహజమైన వెంటిలేషన్ ఉన్న భవనాలలో పనిచేసే వ్యక్తులతో పోల్చుకుంటే ఎయిర్ కండిషన్ భవనాలలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏసీలో ఎక్కువ సమయం ఉండడానికి ఆసక్తి చూపించకండి. రోజుకు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే ఏసీ కింద ఉంటే సరిపోతుంది.