Coconut Water: ఎండాకాలంలో దాహం బారినుంచి బయటపడాలంటే ఓ కొబ్బరి బోండా తాగితే చాలు. ఇట్టే దాహం తీరిపోతుంది. అంతేకాకుండా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇలా కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మాములుగా కొబ్బరినీళ్లు నీరసంగా ఉన్నా, లేదంటే జ్వరం వచ్చినా తాగితే తొందరగా కోలుకోవచ్చు. అంతేకాకుండా కొబ్బరి నీళ్లు తాగితే బరువు కూడా తగ్గుతారట.. అది ఎలానో తెలుసుకుందాం.
Read Also: Left Parties: ప్రొ.హరగోపాల్‌పై దేశద్రోహం కేసు బనాయించడం హాస్యాస్పదం
బరువు తగ్గడం కోసం కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. అయితే ఆ కేలరీలు కొబ్బరి నీరులో ఎక్కువగా ఉంటుందట. అందుకే బరువును తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతాయి. అంతేకాకుండా షుగర్ రష్ వచ్చే అవకాశాలు కూడా తక్కువట. కొబ్బరి నీళ్లలో షోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడటానికి సహాయపడే ఎంజైమ్లు, ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.
Read Also: Paddy Procurement : ఒకేరోజు 3000కోట్లు రైతులకు బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు బాగా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసే ఎంజైమ్లను కలిగి ఉంటుంది. దానివల్ల జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీరు కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది అకస్మత్తుగా వచ్చే ఆహార కోరికలను కూడా తగ్గిస్తుంది.
కొబ్బరి నీళ్లలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి అధిక జీవక్రియ సమయంలో కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. శరీర ఆర్ద్రీకరణను పెంచడానికి కొబ్బరి నీళ్లు మంచిగా పనిచేస్తాయి. కొబ్బరి నీరు శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకోసం రోజుకో ఒక లీటర్ కొబ్బరి నీళ్లు తాగడం మంచింది.