తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబీకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఖలందర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఖలందర్ నగర్‌కు చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ అనే యువకుడు చాంద్రాయణగుట్టకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే.. వీరిద్దరి ప్రేమ విషయం అమ్మాయి తండ్రి మహమ్మద్ అబిడ్ అలీకి తెలియడంతో గత మూడు రోజుల క్రితం ఇమ్రాన్ ఇంటికి వచ్చాడు. ఇమ్రాన్ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి విషయంపై చర్చిద్దాం అని వెళ్ళిపోయాడు.
Read Also: Somu Veerraju: హామీలన్నీ అమలు చేస్తాం.. ఇదే జగన్‌కు నా హామీ..
కాగా.. నిన్న చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఇమ్రాన్ తమ అమ్మాయిని వేధిస్తున్నాడని అమ్మాయితో ఫిర్యాదు చేయించి పోలీస్ స్టేషన్‌కు ఇమ్రాన్‌ను పిలిపించాడు. దీంతో.. చాంద్రాయణగుట్ట పోలీసులు ఇమ్రాన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో.. మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణం తాను ప్రేమించిన అమ్మాయి పేరెంట్స్.. ముఖ్యంగా అమ్మాయి తండ్రి మొహమ్మద్ అబిడ్ అలీ ప్రధాన కారకుడు అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులను కోరుతూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Kunamneni Sambasiva Rao: స్థానిక సంస్థల ఎన్నికలపై కూనంనేని కీలక వ్యాఖ్యలు..