Shocking: “చావు తర్వాత ఏం జరుగుతుంది”.. టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య..
- చావు తర్వాత ఏం జరుగుతుందని సెర్చ్..
- మణికట్టు, గొంతు కోసుకుని టీనేజ్ అమ్మాయి సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది..?’’ అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిందని పోలీసులు మంగళవారం తెలిపారు. నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న బాధితురాలు, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కూతురు. ఆమె మరణం, విదేశీ సంస్కృతుల గురించి తరుచుగా సెర్చ్ చేస్తుందని వారు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ‘స్టోన్ బ్లేడ్ కత్తి’తో తన మణికట్టుపై కోసుకుని, అడ్డంగా గీతలు పెట్టుకుంది, ఆ తర్వాత తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Sam Pitroda: ‘‘అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్‌లోకి రానివ్వండి’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడి వ్యాఖ్యలు..
Also Read
ఆమె తల్లి సోమవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఛత్రపతి నగర్ ప్రాంతంలోని తన ఇంట్లోని బెడ్‌రూంలో పడి ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు అమ్మాయి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ‘‘మరణం తర్వాత ఏమి జరుగుతుంది.??’’ అని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాలిక తన డైరీలో విదేశీ సంస్కృతుల గురించి విస్తృతంగా రాసిందని పోలీసులు గుర్తించారు. అమ్మాయికి యూరోపియన్ కల్చర్‌పై ఆస్తి ఉందని, కొంతకాలంగా మరణంపై పరిశోధన చేస్తోందని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అమ్మాయి తన మణికట్టుపై 5 కోతలు పెట్టుకున్నట్లు, ఇందులో రెండు క్రాస్ మార్క్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఆ అమ్మాయి ఆన్‌లైన్ గేమింగ్‌కి బానిస అయిందని దర్యాప్తులో తేలినట్లు అధికారి తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి వారి ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుండగా, మొదటి అంతస్తులో ఆమె మామ కుటుంబం, అమ్మమ్మ ఉంటున్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసుని నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!