సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు చిన్న చిన్న కారణాలకే దెబ్బతింటున్నాయి. కారణాలు ఏమైనా సరే కల కాలం కలిసి జీవించాల్సిన వాళ్లు అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని యువతకు సూచించారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ అవిరామ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. Also Read:FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు…
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత పెడదార్లు పడుతోంది. బెట్టింగ్ మాయలో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. బెట్టింగ్ లో పెట్టింది తిరిగి వచ్చుడు దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చుకబోయి రోడ్డున పడుతున్నారు చాలామంది. అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బుకోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి…
తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో అబ్దుల్ జమిర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులే కారణమని తోటి స్నేహితులతోనే జమీర్ చెప్పుకున్నాడు. అయితే, గత శనివారం రోజు తాను అద్దెకు ఉన్న ఫ్లాట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కుమారులను దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ.. ఇద్దరు బాలురు తుది శ్వాస వదిలారు. ఈ ఘటన అనంతరం ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే చంపేసి…
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల…