Hyderabad: హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో అబ్దుల్ జమిర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులే కారణమని తోటి స్నేహితులతోనే జమీర్ చెప్పుకున్నాడు. అయితే, గత శనివారం రోజు తాను అద్దెకు ఉన్న ఫ్లాట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కుమారులను దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ.. ఇద్దరు బాలురు తుది శ్వాస వదిలారు. ఈ ఘటన అనంతరం ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే చంపేసి…
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల…
కర్ణాటకలోని బెళగావిలో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐశ్వర్య మహేష్ లోహర్ (20)ని ప్రశాంత్ కుండేకర్ (29) అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Vizag: విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడి పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత రెండు రోజుల క్రితం ఆనంద్ కి దొరకడంతో ఆనంద్ తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
Palnadu: పల్నాడు జిల్లాలో ప్రేమ వివాదం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియుడు మోసం చేయటమే కాక చంపేస్తానని బెదిరించడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వినుకొండకు చెందిన యువతి సెల్ఫీ విడుదల చేసింది.
హైదరాబాద్ మధురానగర్‌లో ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ప్రియుడు సూర్యనారాయణ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమె భర్త ముందే 'నీ పెళ్లాంని నాకిచ్చేయ్.. బాగా చూసుకుంటాను' అని అన్నాడు. దీంతో.. ప్రియురాలి భర్త, సూర్యనారాయణకు మధ్య గొడవ జరిగింది.
న్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అరవింద్ (23) అనే వ్యక్తి లక్షలు పోగొట్టుకున్నాడు. యువకుడు అరవింద్ డిగ్రీ చదువుతున్నాడు.