ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటుగా విద్యారంగం పై కూడా ఎక్కువగా పడింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి అన్ని విద్య సంస్థలు. కానీ చాలామంది పేద పిల్లల వద్ద ఆన్లైన్ తరగతులు వినడానికి ఫోన్స్, లాప్‌టాప్స్ వంటిని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే అలాంటి పేద విద్యార్థులకు తానా చేయూతను…
కరోనా మహమ్మారి దెబ్బకు స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత.. అక్కడక్కడ మళ్లీ తెరిచే ప్రయత్నాలు చేసినా.. మళ్లీ కోవిడ్ పంజా విసరడంతో.. అంతా వెనక్కి తగ్గారు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుందని.. టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసి.. మళ్లీ భౌతిక తరగతులు ప్రారంభించుకోవచ్చు అనే…
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో…
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదా ఆన్లైన్ విధానం ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు. ఇందులో భాగంగానే సత్యసాయి నిగమాగమం నుండి మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులు. read also : సినిమాలో కోడి కథ లాగే కేసీఆర్…
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు జేఎన్టీయు కు చెందిన ముగ్గురు విద్యార్ధులు ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ముగ్గురు విద్యార్ధులను మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంపిక చేసుకుంది. సాయి అస్రిత్ రెడ్డి, స్పూర్తిరాజ్, మహ్మద్ మూర్తుజాలు ఎంపికైనట్టు ఆ టెక్ దిగ్గజ సంస్థ తెలియజేసింది. సంవత్సరానికి రూ.41 లక్షల వేతనంతో వీరిని ఎంపిక చేసుకున్నది. జేఎన్టీయు నుంచి మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైన వారిలో వీరిదే అత్యధిక వేతనం కావడం విషేషం. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల ఎంపికయ్యాక ఆ సంస్థలో భారతీయులకు…
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది.…
కరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహన్ నగరంలో ఒకే చోట 11 వేల మంది విద్యార్ధులు మాస్క్‌లు లేకుండా గుమిగూడారు. సోషల్ డిస్టెన్స్ లేకుండా పక్కపక్కనే కూర్చున్నారు. వూహాన్‌లోని విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా జరిగిన వేడుకలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ఒకచోట పదిమంది కలిసి కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. కలిసి తిరగాలంటే ఆంధోళన చెందుతున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావడంలేదు. 2019 డిసెంబర్ నెలలో వూహాన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత…
కరోనా మహమ్మారి ఎక్కడ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి.. ముఖ్యంగా ఎక్కువమంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ కలకలమే సృష్టించింది.. సూపర్-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ నెమ్మిదిగా సాగుతుంది. ఇక ఈరోజు నుండి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ కోసం వచ్చే విద్యార్థులు పాస్ పోర్ట్, వీసాలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. అయితే నారాయణగూడ ఐసీఎం ఆవరణలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు వేలకు పైగా కరోనా కేసులు…