జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటుంది. తాజాగా ఈ రెండు పథకాల డబ్బుకు బదులు ల్యాప్‌టాప్ కావాలని ఆప్షన్ ఇచ్చారు విద్యార్థులు. ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారిలో 6.53 లక్షల మంది ఉన్నారు.
తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు కాకుండా ల్యాప్‌టాప్‌లు కావాలని కోరిన విద్యార్థులకు వీటిని మంజూరు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే బాధ్యతను ఏపీటీఎస్‌కు నోడల్ ఏజెన్సీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. లెనోవా, హెచ్‌పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు ప్రభుత్వం అందించనుంది.