సమాజంలో లింగ భేదాన్ని నిర్ములించడానికే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఆడ, మగా ఇద్దరు సమానమేనని అందరు అంటూ ఉంటారు కానీ చేతల్లో మాత్రం చూపించరు. అమ్మాయి జీన్స్ వేసుకుంటే తప్పు లేదు.. కానీ అబ్బాయి మాత్రం స్కర్ట్ వేసుకుంటే మాత్రం అందరు వింతగా చూస్తారు.. ఎగతాళి చేస్తారు. లింగ బేధం లేనప్పుడు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొంటే ఏంటి..? అనే ప్రశ్న ఆ స్కూల్ విద్యార్థులకు వచ్చింది. ఆ ప్రశ్నే ఒక పోరాటానికే నాంది పలికింది. ఒక దేశాన్నే కదిలించింది.
వివరాలలోకి వెళితే.. యూకే లోని ఎడిన్ బర్గ్ క్యాసిల్ వ్యూలో ప్రైమరీ స్కూల్ లో మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్ట్ ధరించి పాఠశాలకు వచ్చాడు. అతడు స్కర్టు ధరించినందుకు పాఠశాల యాజమాన్యం తరగతి గదిలోని అనుతించలేదు. అంతేకాకుండా ఇలాంటి బట్టలు వేసుకొని వస్తే అస్సలు స్కూల్ కి రావొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే దీనిపై అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైకెల్ స్కర్టు ధరిస్తే తప్పు ఏంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
ఒక్క విద్యార్థి స్కర్ట్ వేసుకొస్తే బయటికి పంపించారు.. అయితే తామందరూ అలాగే వస్తామని పోరాటానికి దిగారు తరువాతి రోజు నుంచి అబ్బాయిలందరు స్కర్ట్ లతో ప్రత్యేక్షమయ్యారు. పాఠశాల స్థాయి నుంచే కాకుండా ‘వేర్ ఏ స్కర్ట్’ పేరిట ఓ ఉద్యమంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఉద్యమం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోరాటానికి వేరే స్కూల్స్ విద్యార్థులు కూడా మద్దతు పలకడంతో ఆ దేశం మొత్తం ఈ పోరాటం వైరల్ గా మారింది.