ఈ కరోనా పాడుగానూ.. ఎప్పుడొచ్చిందో.. ఎలా వచ్చిందో కానీ.. అందరికంటే ఎక్కువగా విద్యార్థులకే నరకం చూపిస్తోంది. కరోనా లాక్ డౌన్ మొదలైంది మొదలు అన్నీ బంద్ పడ్డాయి. అయితే అన్నీ పట్టాలెక్కినా కూడా ఇంకా మొదలు కానిది ఏమన్నా ఉందా? అంటే అవి చదువులే.. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కండ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ప్రస్తుతం పెద్ద…
దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం సెకండ్ వేవ్ లో పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై భిన్నాభిప్రాయాలు…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…
తెలంగాణలో నేటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. అయితే ప్రత్యక్ష తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హెకోర్టు.. పిల్లలను బడికి రావాలని బలవంత పెట్టొద్దని సూచించింది. స్కూళ్లు తెరుచుకోవచ్చని చెప్తూనే.. కండీషన్స్ అప్లై అంటోంది న్యాయస్థానం. తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. నేటి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానుంది. స్కూళ్ల ఓపెనింగ్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కొన్ని షరతులు విధిస్తూ స్కూళ్ల…
ఇంజనీరింగ్ కాలేజీల్లో బి కేటగిరి(యాజమాన్య కోట) సీట్లు నిబంధనలకు విరుద్దంగా కేటాయిస్తున్నారని, కొన్ని కాలేజిలో ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారని అడ్మిషన్స్, ఫి రెగ్యులేటరీ కమిటీ కి ఫిర్యాదు చేసింది ఏబీవీపీ. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫీజుల నియంత్రణ కమిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లకు సర్క్యులర్ జారీ చేసింది. ఏ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ పూర్తి అయ్యాకే యాజమాన్య కోట సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఇచ్చే అడ్మిషన్స్ చేపట్టాలి. మెరిట్ ప్రకారమే అడ్మిషన్స్ ఇవ్వాలి.…
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మరియు కాలేజ్ పిల్లలకు ఆట స్థలం క్రింద ఉన్న ఒకే ఒక్క స్థలంలో ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దాంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు పాఠశాలల విద్యార్థులు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి… చుట్టుపక్కల రెండు మూడు ఊర్లలో ఒక్క గ్రౌండ్ కూడా లేదు. మాకు ఈ ఒక్క గ్రౌండ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కోల్డ్…
ప్రపంచం మొత్తం కరోనాతో టెన్షన్ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబన్లతో టెన్షన్ పడుతున్నది. తాలిబన్లు ఆక్రమణలతో ఆ దేశం ఇప్పుడు అయోయమ స్థితిలో పడిపోయింది. 1996 నుంచి 2001 వరకు ఆ దేశాన్ని తాలిబన్లు పరిపాలించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరుర్కొన్నారో అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 12 ఏళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంపై నిషేదం ఉన్నది. షరియా చట్టాల ప్రకారమే వారు పరిపాలిస్తుంటారు. ఇప్పుడు సుపరిపాలన అందిస్తామని, మహిళల హక్కులు గౌరవిస్తామని చెబుతున్నా వారి…
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అనేక విశ్వ విద్యాలయాల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. చాలా కాలం తరువాత తిరిగి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు బడికి పంపుతుండటంతో ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్ను అందించారు. మిగిలిన కొంతమందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పీడందుకుంది. కరోనా వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ ట్రెండ్ అన్ని దేశాలలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగునంగా 50 కి పైగా దేశాలలో ఇప్పటికే స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. తెరుచుకుంటున్న బడి తలుపులు దాదాపు ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. అన్ని రంగాలపై అది తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో విద్యా ఒకటి.…
కరోనా కారణంగా ప్రస్తుతం ఏపీలో స్కూళ్లు బంద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అందువల్ల 16వ తేదీ నాటికి మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తి చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాడు-నేడు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షితున్నారు విద్యా శాఖ ఉన్నతాధికారులు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా జరుగుతున్నాయి నాడు-నేడు పనులు.ఆధునికీకరణతో ప్రభుత్వ స్కూళ్లకు న్యూ లుక్ రానుంది.…